Nandigama | నందిగామ శివారులో బస్సు ప్రమాదం

by Thanuru Gopichand |   (  Updated:2025-11-18 02:55:16  IST  )

ఎన్టీఆర్ జిల్లా నందిగామ (Nandigama) శివారులో సోమవారం అర్థరాత్రి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ కు (Private Travels) చెందిన బస్సు ప్రమాదానికి గురైంది.

Nandigama | నందిగామ శివారులో బస్సు ప్రమాదం
X

దిశ, వెబ్ డెస్క్ : ఎన్టీఆర్ జిల్లా నందిగామ (Nandigama) శివారులో సోమవారం అర్థరాత్రి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ కు (Private Travels) చెందిన బస్సు ప్రమాదానికి గురైంది. పోలీసుల సమాచారం ప్రకారం బస్సు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. 35 మంది ప్రయాణికులతో బయలుదేరిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నందిగామ బైపాస్ అనాససాగరం (Anasasagaram) వద్ద ప్రమాదానికి గురైంది. ఓ లారీని ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో ఎదురుగా వచ్చే మరో లారీని బస్సు ఢీకొట్టింది. దీంతో బస్సు ఎడమ భాగం నుజ్జు నుజ్జు అయ్యింది. లారీని బస్సు బలంగా ఢీకొట్టడంతో 11 మందికి గాయాలు కాగా, ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను హాస్పిటలుకు తరలించి చికిత్సను అందిస్తున్నారు.

Next Story