- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నా కాల్‌డేటా ఇస్తా.. తమరూ ఇస్తారా: జోగి రమేశ్‌కు వసంత కృష్ణ ప్రసాద్ సవాల్
తన కాల్‌డేటా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని జోగి రమేశ్ కూడా ఇస్తారా అని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సవాల్ విసిరారు...

దిశ, వెబ్ డెస్క్: తన ఏళ్ల కాల్‌డేటా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని, జోగి రమేశ్(Jogi Ramesh) కూడా ఇస్తారా అని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్(Mailavaram Mla Vasantha Krishna Prasad) సవాల్ విసిరారు. తనకు రాజకీయ పెట్టింది తానేనన్న జోగి రమేశ్ వ్యాఖ్యలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 2029 ఎన్నికల్లో మైలవరం నుంచి తాను గెలిచానని, జోగి రమేశ్ ఓడిపోయారని గుర్తు చేశారు. ప్రత్యర్థులుగా రెండు సార్లు పోటీ చేస్తే కూడా ఓడిపోయారని ఎద్దేవా చేశారు. అలాంటి వ్యక్తి తనకు రాజకీయ భిక్ష పెట్టడమేంటని వసంత కృష్ణ ప్రసాద్ ప్రశ్నించారు.
తమ కుటుంబ 50 ఏళ్లుగా రాజకీయాల్లో ఉందని, మైలవరం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా పని చేసిన తనపై ఎలాంటి ఆరోపణలు లేవన్నారు. నకిలీ మద్యం కేసు ఏ1 నిందితుడు జనార్ధన్ రావు వ్యవహారంలో తమ ప్రమేయం లేదని చెప్పారు. లోకేశ్(Lokesh), కోటేశ్వరరావు, తనపై వాట్సాప్ చాట్‌లు జోగి రమేశ్ తయారు చేయించి నేరానికి పాల్పడ్డారన్నారు. బూడిద వ్యవహారంలో ఏ ఆధారాలతో తనపై ఆరోపణలు చేశారని వసంత కృష్ణ ప్రసాద్ నిలదీశారు.






