నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జాబ్ మేళాపై మంత్రి కొల్లు కీలక ప్రకటన

by Vemula.Srinu Prasad |

నిరుద్యోగులకు మంత్రి కొల్లు రవీంద్ర గుడ్ న్యూస్ తెలిపారు...

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జాబ్ మేళాపై మంత్రి కొల్లు కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: నిరుద్యోగులకు మంత్రి కొల్లు రవీంద్ర(Minister Kollu Ravindra) గుడ్ న్యూస్ తెలిపారు. ప్రతి ఆరు నెలలకు జాబ్ మేళా(Job Mela) నిర్వహిస్తామని ఆయన చెప్పారు. అవసరమైతే మచిలీపట్నంలో శాశ్వత శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ‘‘జాబ్ మేళాలో పాల్గొనే వారు జీతం ముఖ్యం కాదు.. తద్వారా కలిగే ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలి. msme పథకం ద్వారా యువత ఉద్యోగాలు కల్పించేలా ఎదగాలి. గోల్డ్ కవరింగ్ పరిశ్రమలు, మత్స్య ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా ఉపాధి కల్పించి ఆర్థికంగా బలోపేతమయ్యే అవకాశం ఉంది. గత ఐదేళ్లు బందరులో జాబ్ మేళా లేదు, యువతకు ఉద్యోగాలు లేవు.’’ అని మంత్రి విమర్శించారు.


‘‘అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ సంస్థ ఏర్పాటుతో దేశానికి కేంద్రంగా రాజధానిని మార్చబోతున్నాం. మచిలీపట్నం పోర్టును త్వరలోనే పూర్తి చేస్తాం. పోర్టు ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేస్తాం. షిప్ నిర్మాణం కంపెనీ, రూ.10 వేల కోట్లతో స్టీల్ ప్లాంట్ బందరులో ఏర్పాటు కాబోతోంది. పోర్టు, టూరిజం, సహా అనేక రంగాల్లో అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తున్నాం. బందరులో ఉన్న పర్యాటక అవకాశాలను ప్రపంచానికి తెలియజేయడం లక్ష్యంగా బీచ్ ఫెస్టివల్ నిర్వహించాం. క్రిటికల్ మైనింగ్ పరిశ్రమలను మచిలీపట్నంలో ఏర్పాటు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నాం.’’ అని కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

Next Story