- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫిషింగ్ హార్బర్, బందరు పోర్టుపై.. మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి కీలక ప్రకటన
ఫిషింగ్ హార్బర్, బందరు పోర్టుపై మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు...

దిశ, వెబ్ డెస్క్: ఫిషింగ్ హార్బర్, బందరు పోర్టుపై.. మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి కీలక ప్రకటనను వీలైనంత త్వరగా పూర్తి చేసి తీరుతామని మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి తెలిపారు. మచిలీపట్నంలో రూ. 39 కోట్ల విలువైన రహదారుల శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన మచిలీపట్నంలో రోడ్ల ప్రతిపాదనలను జాతీయ రహదారుల సంస్థ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. గత ఐదేళ్లు ఆర్ అండ్ బీ శాఖ ఉందా అనేలా రోడ్లన్నీ గుంతలమయమయ్యాయని చెప్పారు. గతంలో పరిశ్రమల్ని తరిమేస్తే తాము పెట్టుబడి పెడతామని పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారని వ్యాఖ్యానించారు. 20 లక్షల ఉద్యోగాలిస్తామన్న హామీ మేరకు పరిశ్రమలను ఏపీకి తీసుకొస్తున్నామని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి ఆర్ధిక ఇబ్బందులున్నా.. సంక్షేమం, అభివృద్ధిని విస్మరించకుండా ముందుకెళ్తున్నామన్నారు. ఏ సంబంధం లేని కేసుల్లో టీడీపీ నేతల్ని అరెస్టు చేసి పైశాచికానందం పొందారని బీసీ జనార్థన్ రెడ్డి విమర్శించారు.
గ్రామాల్లో కక్షలు కార్పణ్యాలు
‘‘గ్రామాల్లో కక్షలు కార్పణ్యాలను ప్రోత్సహించారు. విధ్వంసంతో పాలన మొదలు పెట్టి అభివృద్ధి లేకుండా చేశారు. నియోజకవర్గం అభివృద్ధికి ఇంత తపించే మంత్రి కొల్లు రవీంద్రను గెలిపించుకోవడం మీ అందరి అదృష్టం. మచిలీపట్నంలోని వైసీపీ దుర్మార్గుల పట్ల పోరాడి కలబడి నిలబడ్డాం. గత ఐదేళ్లు విధ్వంసం, దాడులు, కేసులు, హత్యలు తప్ప ఇంకేమీ లేదు. ఉనికిని కాపాడుకోవడానికి మైకులు పట్టుకుని పిచ్చిగా వాగినంత మాత్రాన ప్రజలు మద్దతివ్వరు. గత ఐదేళ్లు విధ్వంసం, దాడులు, కేసులు, హత్యలు తప్ప ఇంకేమీ లేదు. ప్రజల కోసం పని చేసిన నాయకుడికి, ఆ ప్రభుత్వానికి మాత్రమే మనుగడ ఉంటుంది’’ అని మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి తెలిపారు.






