- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు : ఎన్టీఆర్ జిల్లా పోలీస్
జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాద నివారణకు చర్యలు తీసుకుంటున్నామని ఎన్టీఆర్ జిల్లా పోలీసులు (NTR District Police) ప్రకటించారు.

దిశ, వెబ్ డెస్క్ : జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాద నివారణకు చర్యలు తీసుకుంటున్నామని ఎన్టీఆర్ జిల్లా పోలీసులు (NTR District Police) ప్రకటించారు. ఈ మేరకు పోలీస్ కమిషనర్ వి.రాజశేఖర బాబు మంగళవారం ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రతి రోజూ రాత్రి సమయంలో 2 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రహదారులపై పోలీసులు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. అంతేకాకుండా స్టాప్, వాష్, రిఫ్రెష్ అండ్ గో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు.
ప్రమాదాలు తగ్గించాం.. బ్లాక్ స్పాట్ లు గుర్తించాం
గతేడాది 420 రోడ్డు ప్రమాద మరణాలు జరిగితే, ఈ ఏడాది 328 జరిగాయన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది 92 మరణాలను తగ్గించగలిగామన్నారు. భవిష్యత్తులో పూర్తి స్థాయిలో ప్రమాదాలను నివారించే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమీషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్ లను గుర్తించామన్నారు. ఆ ప్రదేశాలలో తగిన చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇబ్రహీంపట్నం, నందిగామ మొదలైన ప్రదేశాలలో ట్రాఫిక్ బ్లింకర్స్ లను, రంబుల్ స్టిక్స్ లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రహదారులపై వెలుతురు సరిగా లేని ప్రదేశాలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులకు తెలియజేశామన్నారు.
అనాసాగరం వద్ద రోడ్డు ప్రమాదం
సోమవారం అర్థరాత్రి హైదరాబాదు నుంచి శ్రీకాకుళం వెళుతున్న కావేరి ట్రావెల్స్ ఎన్టీఆర్ జిల్లా నందిగామ టౌన్ అనాసాగారం (Anasagaram) ఫ్లై ఓవర్ పైన షుగర్ లోడ్ తో వెళుతున్న లారీని ఓవర్ టెక్ చేయబోయిందని పోలీస్ కమిషనర్ వి.రాజశేఖర బాబు తెలిపారు. ఈ క్రమంలో జరిగిందని, ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 23 మంది ప్రయాణికులు ఉన్నారని వెల్లడించారు.
వెంటనే చేరుకున్న పోలీసులు
ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారని కమిషనర్ తెలిపారు. గాయపడిన వారిని హాస్పిటల్ లో చేర్పించారన్నారు. ఈ ప్రమాదంలో మొత్తం 8 మంది గాయపడ్డారని, వారిలో 05 మంది చిన్న చిన్న గాయాలతో చికిత్స తీసుకున్న అనంతరం వెళ్ళిపోయారన్నారు. మిగిలిన ముగ్గురిలో ఇద్దరికి హెయిర్ లైన్ ఫ్యాక్చర్స్ అయ్యాయి అన్నారు. మరొక మహిళకు కాలు విరిగిందన్నారు. వారిని తదుపరి చికిత్స నిమిత్తం విజయవాడ ఆసుపత్రికి రిఫర్ చేయడం జరిగిందని తెలియజేశారు.
ట్రాఫిక్ క్లియర్ చేశాం
ప్రమాదం జరిగిన ప్రదేశంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా నేషనల్ హైవే అధారిటి సహాయంతో క్రేన్ తీసుకువచ్చి వాహనాలను తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశామని కమిషనర్ రాజశేఖర్ బాబు పేర్కొన్నారు. ఆ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ప్రత్యామ్నాయ బస్సులలో వారి గమ్యస్థానాలకు పంపడం జరిగిందని స్పష్టం చేశారు. ఇటువంటి ప్ర మాదాలు జరగకుండా పటిష్టమైన జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.






