- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొడాలి నాని హెల్త్ అప్డేట్.. మరో 30 రోజులు పాటు?
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కొడాలి నాని ( kodali nani ) హెల్త్ అప్డేట్ బయటకు వచ్చింది. మరో 30 రోజులు అంటే నెల..

దిశ, వెబ్ డెస్క్ : వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కొడాలి నాని ( kodali nani ) హెల్త్ అప్డేట్ బయటకు వచ్చింది. మరో 30 రోజులు అంటే నెల.. రోజుల పాటు ఆసుపత్రిలోనే కొడాలి నాని ఉండనున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. తాజాగా కొంత మంది వైసీపీ నేతలు ( ycp leaders)... ముంబై ( Mumbai ) వెళ్లి.. మాజీ మంత్రి కొడాలి నానిని పరామర్శించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆ పార్టీ నేతలు... కొడాలి నాని కి సంబంధించిన హెల్త్ అప్డేట్ పై కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు మాట్లాడారు.
ముంబైలోని ఏషియన్ హార్ట్ కేర్ ఇన్స్టిట్యూట్ చీఫ్ సర్జన్ రమాకాంత్ పాండే ( Ramakant Pandey) 8 నుంచి 10 గంటల పాటు శ్రమించి.. కొడాలి నాని కి సర్జరీ ( Kodali Nani undergoes surgery )చేసినట్లు... పేర్కొన్నారు. ఆయన అవయవాలు అన్ని కూడా... బాగానే ఉన్నాయని.. చాలా స్పందిస్తున్నాయని వెల్లడించారు. కొన్ని రోజులపాటు ఆయన ఐసీయూలోనే ఉంటారని కూడా తెలిపారు వైసీపీ నేతలు. ఆ తర్వాత వైద్యుల పర్యవేక్షణలో దాదాపు నెల రోజుల పాటు కొడాలి నాని ముంబైలో ఉండాల్సి ఉంటుందని.. స్పష్టం చేశారు. త్వరలోనే కోలుకుని.. పులిలా కొడాలి నాని గర్జిస్తారని కూడా ధీమా వ్యక్తం చేశారు వైసీపీ నేతలు. కాగా రెండు రోజుల కిందట మాజీ మంత్రి కొడాలి నానికి గుండెకు సంబంధించిన సర్జరీ జరిగిన సంఘటన తెలిసిందే.






