దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-10-27 13:50:50  IST  )

15 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్ చేసిన ఘటన చందర్లపాడు మండలం ముప్పాళ్ళలో జరిగింది. ..

దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్
X

దిశ, నందిగామ: 15 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్ చేసిన ఘటన చందర్లపాడు మండలం ముప్పాళ్ళలో జరిగింది. గ్రామంలో చిన్న పిల్లలతో ఆడుకుంటున్న క్రమంలో బాలికకు నలుగురు వ్యక్తులు జామకాయలు ఆశ చూపి ఓ ఇంట్లోకి తీసుకెళ్లారు. అనంతరం బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. దీంతో బాలిక బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. జామకాయల్లో మత్తు మందు కలిపి గ్యాంగ్ రేప్‌కు పాల్పడినట్లు తెలిపారు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వ్యక్తిని అదుపులో తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే అత్యాచారానికి గురైన బాలిక తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యుల సమక్షంలో బాధితురాలిని నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Next Story