- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Police Custody: తొలి రోజు ఉక్కిరిబిక్కిరి..!
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని తొలి రోజు పోలీస్ కస్టడీ ముగిసింది...

దిశ, వెబ్ డెస్క్: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi)ని తొలి రోజు పోలీస్ కస్టడీ ముగిసింది. నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ కేసు(Fake house patta distribution case)లో ఆయన్ను మరింతగా విచారించేందుకు నూజివీడు కోర్టు(Nuzvidu Court) అనుమతించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు విచారణలో భాగంగా శుక్రవారం ఉదయం అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కంకిపాడు పోలీస్ స్టేషన్(Kankipadu Police Station)లో ప్రశ్నించారు. నకిలీ ఇళ్ల పట్టాలు ‘‘ఎక్కడ, ఎవరు తయారు చేయించారు. 2019 ఎన్నికల వేళ ఇళ్ల పట్టాలు ఎందుకిచ్చారు.?’’ అనే ప్రశ్నలు సంధించారు. వీటితో వల్లభనేనిని 20 మొత్తం ప్రశ్నలు అడిగారు. సాయంత్రం కస్టడీ ముగియడంతో వల్లభనేని వంశీని కంకిపాడు పోలీస్ స్టేషన్‌లోనే ఈ రాత్రికి ఉంచుతున్నారు. శనివారం రెండో రోజు కస్టడీకి తీసుకుని మరిన్ని ప్రశ్నలు అడగనున్నారు. అయితే ఈ రోజు పోలీసులు అడిగిన ప్రశ్నలను ఆయన ఉక్కిరిబిక్కిరి అయినట్లు తెలుస్తోంది. పలు ప్రశ్నలను దాటవేసినట్లు తెలుస్తోంది. మరి రేపటి విచారణలో పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.






