Mla Vellampalli: హిందూ దేవుళ్లను అవమానించింది చంద్రబాబే!

by Vemula.Srinu Prasad |

దేవుళ్ళను, హిందువులను అవమానించే వ్యక్తులు చంద్రబాబు, అచ్చెన్నాయుడు అని మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు విమర్శించారు...

Mla Vellampalli: హిందూ దేవుళ్లను అవమానించింది చంద్రబాబే!
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేవుళ్ళను, హిందువులను అవమానించే వ్యక్తులు చంద్రబాబు, అచ్చెన్నాయుడు అని మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. గతంలో బూట్లు వేసుకొని దైవ పూజలు చేసిన వ్యక్తులన్నారు. గతంలో అనేక దేవాలయాలను కూల్చిన వ్యక్తి చంద్రబాబు, అయితే వాటిని పునర్ నిర్మిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని వెల్లంపల్లి స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయంలో శుక్రవారం ‘మా నమ్మకం నువ్వే జగనన్న’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని, తమ వద్ద దాపరికాలు ఉండవని, తాము ఏమి చేసినా ప్రజలకే మంచి చేస్తామని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల వద్దకే పరిపాలన అందిస్తున్నామని వెల్లంపల్లి శ్రీనివాసరావు చెప్పారు.

Next Story