చంద్రబాబుకు సరైన రీతిలో బుద్ధి చెప్తారు: వెల్లంపల్లి శ్రీనివాస్ మాస్ వార్నింగ్

by Vemula.Srinu Prasad |

చంద్రబాబు ప్రభుత్వంపై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సంచలన ఆరోపణలు చేశారు...

చంద్రబాబుకు సరైన రీతిలో బుద్ధి చెప్తారు: వెల్లంపల్లి శ్రీనివాస్ మాస్ వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: సూపర్ సిక్స్ అని ప్రజలకు ఒక క్రికెట్ సిక్స్ ఇచ్చిన కుటమి ప్రభుత్వానికి ప్రజలు రానున్న రోజులు సరైన రీతిలో బుద్ధి చెప్తారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ హెచ్చరించారు. విజయవాడలో వైసీపీ నేతల అరెస్ట్ ను ఆయన తీవ్ర ఖండించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు రూ. 20 వేలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు ఆ మాట తప్పిందని ఆరోపించారు. రైతుల కోసం చేపట్టిన కార్యక్రమాన్ని అక్రమంగా అడ్డుకోవడం సబబు కాదన్నారు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేయడం తప్పా అని వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రశ్నించారు.

కాగా రైతులకు అండగా వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ఇచ్చిన పిలుపుమేరకు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను దిగారు. విజయవాడలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు అవుతూ శైలజ రెడ్డి, బెల్లం దుర్గ, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు ప్రయత్నం చేశారు. దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు. ఈ ఘటనపై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు.

Next Story