బస్టాండ్ ఎదురుగా ప్రైవేట్ బస్సులో చెలరేగిన మంటలు.. బస్సులో 35 మంది?

by Naga Rani Yarlagadda |

విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులున్నారు.

బస్టాండ్ ఎదురుగా ప్రైవేట్ బస్సులో చెలరేగిన మంటలు.. బస్సులో 35 మంది?
X

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడ నగరంలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ (PNBS) సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉండగా.. డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడటంతో అధికారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

రావులపాలెం నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సు విజయవాడ బస్టాండ్ ఎదురుగా ఉన్న రోడ్డుపైకి రాగానే, ఇంజిన్ భాగం నుండి దట్టమైన పొగలు రావడం డ్రైవర్ గమనించారు. వెంటనే అప్రమత్తమైన ఆయన బస్సును రోడ్డు పక్కన నిలిపివేసి, ప్రయాణికులను త్వరగా కిందకు దిగిపోవాలని సూచించారు. నిమిషాల వ్యవధిలోనే మంటలు బస్సు మొత్తానికి విస్తరించాయి. బస్సులోని బ్యాటరీ టెర్మినల్స్ వద్ద షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు అంటుకున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే విజయవాడ ఫైర్ స్టేషన్ సిబ్బంది ఫైర్ ఇంజిన్‌తో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే బస్సు లోపలి భాగం కొంత మేర దగ్ధమైంది.

Next Story