- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాలకాయతిప్పలో సముద్రం అల్లకల్లోలం.. 500 మీటర్లు ముందుకు..!
కృష్ణా, నెల్లూరు జిల్లాలపై దిత్వా తుపాను ఎఫెక్ట్ పడింది...

దిశ, వెబ్ డెస్క్: కృష్ణా(Krishna), నెల్లూరు(Nellore) జిల్లాలపై దిత్వా తుపాను(Ditva Cyclone) ఎఫెక్ట్ పడింది. దీంతో రెండు చోట్లా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా జిల్లా అవనిగడ్డలో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పాలకాయతిప్ప వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఉవ్వెత్తున రాకాసి అలలు ఎగిసిపడుతున్నాయి. 500 మీటర్ల మేర సముద్రం ముందుకు దూసుకువచ్చింది. దీంతో బీచ్ వద్దకు ఎవరినీ అనుమతించడంలేదు. తాత్కాలకంగా బీచ్ ను మూసి వేస్తున్నట్లు ప్రకటించారు.
మరోవైపు నెల్లూరు జిల్లాలోనూ భారీగా వర్షం కురుస్తోంది. పలుచోట్ల మోస్తరుగా పడుతుంటే కొన్ని ప్రాంతాల్లో దంచి కొడుతోంది. దీంతో పలు కాలనీలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాసాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేపట్టారు.






