కృష్ణాజిల్లాలో డ్రగ్స్ కలకలం.. పెనమలూరులో కొకైన్ పట్టివేత

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-09-09 04:28:56  IST  )

డ్రగ్స్ భూతాన్ని రూపుమాపేందుకు ఈగల్ టీమ్ (Eagle Team) ఉక్కుపాదం మోపుతోంది.

కృష్ణాజిల్లాలో డ్రగ్స్ కలకలం.. పెనమలూరులో కొకైన్ పట్టివేత
X

దిశ, వెబ్‌డెస్క్: డ్రగ్స్ భూతాన్ని రూపుమాపేందుకు ఈగల్ టీమ్ (Eagle Team) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా కృష్ణాజిల్లాలో డ్రగ్స్ సరఫరా కలకలం రేపింది. పెనమలూరు వద్ద పోలీసుల తనిఖీల్లో 2 గ్రాముల కొకైన్ లభించింది. కొకైన్ (Cocaine) సప్లై చేస్తున్న ఆటో డ్రైవర్ ను ఈగల్ టీమ్ అదుపులోకి తీసుకుంది. హైదరాబాద్ నుంచి కొకైన్ తీసుకువచ్చినట్లు చెప్పాడు. ఆటోడ్రైవర్ చెప్పిన వివరాలతో హైదరాబాద్ లో ఎక్కడి నుంచి డ్రగ్స్ సప్లై అవుతుందన్న దానిపై ఈగల్ టీమ్ ఫోకస్ పెట్టింది.

కాగా ఇటీవలే మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసులు చర్లపల్లి వాసవి ల్యాబ్స్ లో భారీ డ్రగ్ రాకెట్ ను బ్లాస్ట్ చేశారు. గురుగ్రామ్ నుంచి అక్కడికి ముడిసరుకు సరఫరా అవుతుందని గుర్తించిన పోలీసులు.. ఇంకా ఏయే రాష్ట్రాల నుంచి ముడిసరుకు సప్లై అవుతుందన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఆ ల్యాబుల్లో కూలీలుగా పనిచేసినవారిలోకానిస్టేబుల్ కూడా ఉండటం అందరినీ షాక్ కు గురిచేసింది.

Next Story