- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేటితో ముగియనున్న సీఎం చoద్రబాబు విదేశీ పర్యటన..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( CM Chandrababu Naidu) ఇండియాకు తిరిగి రానున్నారు. ఇవాల్టితో..

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( CM Chandrababu Naidu) ఇండియాకు తిరిగి రానున్నారు. ఇవాల్టితో.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీ ( Foreign ) పర్యటన ముగియనుంది. తన వ్యక్తిగత కారణాలు, పుట్టినరోజు నేపథ్యంలో విదేశీ పర్యటనకు చంద్రబాబు నాయుడు కుటుంబం మొత్తం.. వెళ్లాల్సి వచ్చింది. ఇక ఇవాళ్ళతో సీఎం చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన ముగియనుంది. ఇవాళ అర్ధరాత్రి 12 గంటలకు... ఇండియాకు చేరుకుంటారు సీఎం చంద్రబాబు నాయుడు.
ఆయన నేరుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రా నికి (Andhra Pradesh) రాకుండా... ఢిల్లీలోనే ( Delhi) ఉండనున్నారు. ఇవాళ అర్ధరాత్రి 12 గంటలకు ఢిల్లీ చేరుకుని... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన నిధులు అలాగే పెండింగ్ సమస్యలపై చర్చించనున్నారు. ఇందులో భాగంగానే రేపు ఢిల్లీలో... కీలక కేంద్ర మంత్రులను.. సీఎం చంద్రబాబు నాయుడు కలవనున్నారు.
అమరావతి నిధులు, ఏపీకి రావాల్సిన ఫండ్స్, ఏపీలో మెట్రో ట్రైన్ విస్తరణ, తదితర అంశాల పైన కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. నిత్యం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పరితపించి పోయే చంద్రబాబు నాయుడు... అదే పనిగా ముందుకు సాగుతున్నారు. విదేశీ పర్యటనకు.. వెళ్లి ఇంటికి రాకుండా మళ్ళీ ఏపీ కోసమే ఢిల్లీలోనే ఉండిపోతున్నారు. దాదాపు రెండు రోజులపాటు ఢిల్లీలో... ఏపీకి సంబంధించిన అంశాలపై చర్చించిన తర్వాత అమరావతికి వస్తారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇది ఇలా ఉండగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు నేపథ్యంలో ఆయనకు దేశ వ్యాప్తంగా శుభాకాంక్షలు తెలిపారు.






