- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Skill Case: సీఐడీ విచారణకు హాజరైన కిలారు రాజేశ్
స్కిల్ డెవలప్ మెంట్ స్కీం స్కాం కేసులో కిలారు రాజేశ్‌ను సీఐడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

X
దిశ, వెబ్ డెస్క్: స్కిల్ డెవలప్ మెంట్ స్కీం స్కాం కేసులో నారా లోకేశ్ సన్నిహితుడు కిలారు రాజేశ్ అనుమానితుడిగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో విచారణకు హాజరుకావాలని ఆయనకు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులపై ఆయన అధికారుల విచారణకు హాజరయ్యారు. విజయవాడ సీఐడీ కార్యాలయంలో రాజేశ్‌ను అధికారులు ప్రశ్నిస్తున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కీంకు సంబంధించిన డబ్బులు కిలారు రాజేశ్ ద్వారా నారా లోకేశ్‌కు చేరాయని సీఐడీ అనుమానిస్తోంది. ఇందులో భాగంగానే కిలారు రాజేశ్‌ను విచారిస్తోంది. కానీ ఈ కేసులో ఆయనను నిందితుడిగా చేర్చలేదు. ప్రస్తుతం రాజేశ్‌ను అధికారులు విచారిస్తున్నారు. దీంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.
Next Story






