Cm Jagan: రేపు సీఎం జగన్ షెడ్యూల్ ఇదే..!

by Disha Web Desk 16 |
Cm Jagan: రేపు సీఎం జగన్ షెడ్యూల్ ఇదే..!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎంవో ఓ ప్రకటన విడుదల చేసింది. సోమవారం ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి బందరు మండల పరిధిలోని తపసిపూడి గ్రామం చేరుకుంటారు. అక్కడి నుంచి పోర్టు నిర్మాణ ప్రదేశంలో భూమి పూజ, అనంతరం పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత మచిలీపట్నంలోని జిల్లా పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి జిల్లా పరిషత్‌ సెంటర్‌లోని భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభా ప్రాంగణానికి చేరుకుంటారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సభ అనంతరం మచిలీపట్నం నుంచి బయలుదేరి మధ్యాహ్నం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు అని సీఎంవో వెల్లడైంది.


Next Story

Most Viewed