- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చంద్రబాబుకు అనారోగ్యం.. ఏసీబీ కోర్టులో హౌస్‌మోషన్ పిటిషన్
చంద్రబాబు అనారోగ్య సమస్యలపై ఆయన లాయర్లు ఏసీబీ కోర్టులో హౌస్ మోహన్ పిటిషన్ దాఖలు చేశారు..

X
దిశ, వెబ్ డెస్క్: స్కిల్ స్కాం కేసులో రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబుకు డీ హైడ్రేషన్‌తో పాటు స్కిన్ అలర్జీ సోకింది. జైలులో ఉక్కపోత వల్లే చంద్రబాబుకు ఈ సమస్యలు తలెత్తినట్లు వెల్లడైంది. చల్లటి వాతావరణంలో ఉంటే సరిపోతుందని అటు వైద్యులు కూడా తెలిపారు. దీంతో చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు లాయర్లు హౌస్ మోహన్ పిటిషన్ దాఖలు చేశారు. జైలులో ఏసీ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో కోరారు. చంద్రబాబు అనారోగ్యంతో బాధపడుతున్నారని డాక్టర్లు ఇచ్చిన నివేదికను ప్రస్తావిస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌పై కోర్టు ఆదేశాలు ఎలా ఉంటాయోననే ఉత్కంఠ టీడీపీ శ్రేణుల్లో నెలకొంది.
Next Story






