- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలుగువారి ఆత్మగౌరవాన్ని మరోమారు తాకట్టుపెట్టారు: చలసాని శ్రీనివాస్ ఫైర్
తెలుగువారి ఆత్మగౌరవాన్ని మరోమారు తాకట్టుపెట్టారని చలసాని శ్రీనివాస్ ఫైర్ అయ్యారు..

దిశ, వెబ్ డెస్క్: తెలుగువారి ఆత్మగౌరవం మరోమారు ఢిల్లీ(Delhi)లో తాకట్టుపెట్టారని ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్(Special Status Sadhana Samiti President Chalasani Srinivas)అన్నారు. విజయవాడ(Vijayawada)లో మీడియాతో మాట్లాడిన ఆయన ఆంధ్రుల జీవనాడి పోలవరాన్ని(Polavaram) నిర్వీర్యం చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. 41.5 మీటర్ల ఎత్తులో నీటిని పరిమితం చేయడం అన్యాయమన్నారు. 155 అడుగుల ఎత్తున నీటి నిల్వ ఉంటేనే ప్రాజెక్ట్‌కు ప్రయోజనమని చెప్పారు. కేంద్రం ఒత్తిడికి వైసీపీ అధినేత జగన్ (Ycp Chief Jagan) తలొగ్గి ఉంటే రూ.12,500 కోట్లు ఎప్పుడో వచ్చేవని తెలిపారు. కానీ పోలవరానికి అన్యాయం జరగకూడదనే జగన్ ఒప్పు కోలేదన్నారు. కేంద్రం ఒత్తిడికి జగన్ తలొగ్గి ఉంటే రూ.12,500 కోట్లు ఎప్పుడో వచ్చేవని చలసాని చెప్పారు.
కేంద్రంలో ఏపీ సీఎం చంద్రబాబు(Ap Cm Chandrababu) ప్రభావం లేదని, ఎంపీలందరూ బీజేపీ(Bjp)కి భజన చేసుకోండని చలసాని మండిపడ్డారు. పోలవరం కోసం కేంద్రాన్ని తాము నిలదీస్తామన్నారు. దమ్ముంటే తమతో కలిసి రావాలని సవాల్ విసిరారు. అమరావతి(Amaravati)కి ముష్టి రూ. 15 వేల కోట్లు పడేశారని, కూటమి ప్రభుత్వం ఎందుకు స్వీట్లు పంచుకుంటున్నారని ప్రశ్నించారు. ఉత్తర భారత అహంకారం నశించాలని పవన్ కల్యాణ్(Pawan Kalyan) గతంలో చేసిన వ్యాఖ్యలను ఆయన మర్చిపోయారా అని నిలదీశారు. పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని గొంతు చించుకున్న పవన్ కల్యాణ్.. యువతకు అన్యాయం జరుగుతుంటే ఎందుకు మాట్లాడటం లేదన్నారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అన్న ప్రతిఒక్కరూ ఆంధ్రా ద్రోహులేనని మండిపడ్డారు. ఏపీని బీజేపీ మోసం చేస్తోందని, ప్రజలు ఇప్పటికైనా మేలుకోవాలని చలసాని శ్రీనివాస్ పిలుపు నిచ్చారు.






