- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సెల్ టవర్ల నిర్వహణ సక్రమంగా ఉండాలి
మొంథా తుఫాను నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా సెల్ టవర్ల నిర్వహణ సక్రమంగా ఉండాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.

దిశ, వెబ్ డెస్క్ : మొంథా తుఫాను నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా సెల్ టవర్ల నిర్వహణ సక్రమంగా ఉండాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని చల్లపల్లి మండలం, రామానగరం, చల్లపల్లిలో ఉన్న బిఎస్ఎన్ఎల్, జియో టవర్లను సందర్శించి పరిశీలించారు. బిఎస్ఎన్ఎల్ టవర్ కండిషన్ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అక్టోబరు 29 వరకు మొంథా తుఫాను ప్రభావంతో జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. సమాచార వ్యవస్థకు సంబంధించిన సెల్ టవర్లను సక్రమంగా నిర్వహించడానికి అవసరమైన బ్యాకప్, జనరేటర్లు, డీజిల్ ఇంధనం సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులకు సూచించారు. సెల్ టవర్ల నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలన్నారు. చల్లపల్లిలో బిఎస్ఎన్ఎల్ టవర్ల జనరేటర్ కండిషన్ బాగానే ఉందన్నారు. ఎలాంటి ఇబ్బంది పడకుండా కావాల్సిన పనిముట్లు, సామాగ్రిని ముందుగానే జాగ్రత్తపరచుకోవాలని సూచించారు.






