- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Acb Court: మద్యం కేసు నిందితుల బెయిల్‌పై తీర్పు రిజర్వ్
మద్యం కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో వాదనలు జరిగాయి....

దిశ, వెబ్ డెస్క్: మద్యం కేసు(Liquor Case)లో నిందితుల బెయిల్ పిటిషన్ల(Bail Pittition)పై శుక్రవారం ఏసీబీ కోర్టు(Acb Court)లో వాదనలు జరిగాయి. తమకు బెయిల్ ఇవ్వాలని ఏడుగురు నిందితుల తరపున వాదనలు కొనసాగాయి. నిందితులకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారంటూ ప్రభుత్వం తరపున లాయర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. అలాగే నిందితుల రిమాండ్ గడువును పొడిగించింది.
కాగా గత ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలు రాష్ట్రవ్యాప్తంగా జరిగాయి. అయితే అమ్మకాల్లో అవకతవకలు జరిగినట్లు కూటమి ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపింది. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు పలువురు నిందితులను అరెస్ట్ చేశారు. గుంటూరు, విజయవాడ జైళ్లలో జుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం రిమాండ్ గడువు ముగియడంతో నిందితులను కోర్టులో ప్రవేశ పెట్టారు. దీంతో వీరి రిమాండ్ గడువును ఈ నెల 24 వరకు ధర్మాసనం పొడిగించింది.






