ఐపీఎస్ సంజయ్‌కు మళ్లీ ఎదురుదెబ్బ.. బెయిల్ పిటిషన్ డిస్మిస్

by Vemula.Srinu Prasad |

నిధుల దుర్మినియోగం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది..

ఐపీఎస్ సంజయ్‌కు మళ్లీ ఎదురుదెబ్బ.. బెయిల్ పిటిషన్ డిస్మిస్
X

దిశ, వెబ్ డెస్క్: నిధుల దుర్మినియోగం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో రిమాండ్ ఖైదీగా ఐపీఎస్ సంజయ్(Ips Sanjay) 80 రోజులుగా జైలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే తనకు బెయిల్ మంజూరు చేయాలని విజయవాడ ఏసీబీ కోర్టు(Acb Court)లో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌ను ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఇప్పటికే రెండు సార్లు సంజయ్ బెయిల్ పిటిషన్లను కోర్టు డిస్మిస్ చేసింది. ఇప్పుడు మూడోసారి కూడా డిస్మిస్ కావడంతో సంజయ్‌కు ఎదురుదెబ్బ తగిలినట్టైంది. గత ప్రభుత్వంలో సంజయ్ ఫైర్ సేఫ్టీ విభాగంలో పని చేశారు. అయితే ఆ సమయంలో నిధులు దుర్వినియోగం అయినట్లు కూటమి ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు ఆయనపై కేసు నమోదు అయింది. అవినీతికి పాల్పడినట్లు తేలడంతో అరెస్ట్ చేసిన విజయవాడ జైలుకు తరలించారు. అప్పటి నుంచి ఆయన రిమాండ్ గడువును ధర్మాసనం పొడిగిస్తూ వస్తోంది. ఇప్పుడు సైతం ఆయన జైల్లోనే ఉన్నారు. తనకు బెయిల్ మంజూరు చేయాలని మూడుసార్లు పిటిషన్లు దాఖలు చేశారు.

Next Story