నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం.. మళ్లీ కస్టడీకి A1, A2 నిందితులు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-11-17 13:52:54  IST  )

నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది...

నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం.. మళ్లీ కస్టడీకి A1, A2 నిందితులు
X

దిశ, వెబ్ డెస్క్: నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు ఏ1, ఏ2 నిందితులు జనార్ధన్ రావు, జగన్ మోహన్‌ను నాలుగు రోజుల పాటు కస్టడీకి ఇస్తూ కోర్టు సూచనలు చేసింది. ఇప్పటికే ఎక్సైజ్ పోలీసులు ఓసారి కస్టడీకి తీసుకుని విచారించారు. మరింత లోతు దర్యాప్తు నేపథ్యంలో మళ్లీ కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు. దీంతో వారిని 4 రోజుల పాటు విచారించేందుకు కస్టడీకి ఇస్తూ ధర్మాసనం ఆదేశించింది. ఈ మేరకు జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న జనార్ధన్ రావు, జగన్ మోహన్‌ కస్టడీకి తీసుకుని మరింతగా విచారించనున్నారు. నకిలీ మద్యం తయారీ వ్యవహారంలో ‘‘వెనుకున్న అసలు సూత్రదారులు ఎవరు..?. ఇంకా ఎంతమందికి లింకులు ఉన్నాయి.. నకిలీ మద్యం అమ్మకాలకు సంబంధించిన లావాదేవీలు ఎలా జరిగాయి.’’ అనే విషయాలను నిందితుల నుంచి రాబట్టనున్నారని తెలుస్తోంది.

Next Story