విజయవాడలో భారీ మోసం.. కోట్లు వసూలు చేసి పరారైన మహిళ

by Vemula.Srinu Prasad |

విజయవాడలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది...

విజయవాడలో భారీ మోసం.. కోట్లు వసూలు చేసి పరారైన మహిళ
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ(Vijawadad)లో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. కోటేశ్వరమ్మ అనే మహిళ రామలింగేశ్వర్ నగర్‌లో ఉంటూ చిట్టీల వ్యాపారం(Chits Business) చేశారు. కోటేశ్వరమ్మ చెప్పిన మాటలు నమ్మి స్థానిక మహిళలు చిట్టీలు వేశారు. తొలుత చిట్టీలు బాగా చెల్లించారు. ఆ తర్వాత కన్నింగ్ ఐడియాకు కోటేశ్వరమ్మ పదును పెట్టారు. మాయ మాటలు చెప్పి రూ. 5 కోట్ల మేర వసూలు చేసి పరారయ్యారు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. కోటేశ్వరమ్మపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోటేశ్వరమ్మను మోసం చేస్తుందని అసలు అనుకోలేదని, ఆమె చెప్పిన మాయ మాటలు నమ్మి నిండా ముగిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కోటేశ్వరమ్మను పట్టుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

Next Story