పండగ రోజు కూడా లంచం.. సీబీఐకి చిక్కిన బీఐఎస్‌జేడీ

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-03-30 18:35:09  IST  )

పండగ రోజూ కూడా అవినీతి అధికారి తన చేతికి పని చెప్పారు...

పండగ రోజు కూడా లంచం.. సీబీఐకి చిక్కిన బీఐఎస్‌జేడీ
X

దిశ, వెబ్ డెస్క్: పండగ రోజూ కూడా అవినీతి అధికారి(Corrupt official) తన చేతికి పని చెప్పారు. బల్లకింద చేయి చాపేందుకు యత్నించారు. అయితే సదరు అధికారికి సీబీఐ(CBI) చుక్కలు చూపించింది. అనంతరం అరెస్ట్ చేసింది. ఈ కేసుతో సంబంధం ఉన్న మరొకరిపైనా చర్యలు తీసుకుంది. ఈ ఘటన విజయవాడ(Vijayawada)లో జరిగింది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్ట్రాండర్స్ జాయింట్ డైరెక్టర్ రమాకాంత్ సాగర్(Bureau of Indian Stranders Joint Director Ramakant Sagar) తాజాగా సీబీఐ వలకు చిక్కారు. బీఐఎస్ మార్క్ కోసం రమాకాంత్‌కు సిలిండర్లను తయారు చేసే కంపెనీ ప్రతినిధులు దరఖాస్తు చేశారు. అయితే రూ.70 వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో సీబీఐకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రమాకాంత్‌ను పక్కా పథకం ప్రకారం సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించారు. రమాకాంత్‌ సాగర్‌తో పాటు ఈ కేసులో సంబంధం ఉన్న లక్ష్మీనారాయణ రెడ్డిని సైతం అరెస్ట్ చేశారు. అనంతరం విజయవాడ సీబీఐ కోర్టులో ప్రవేశ‌పెట్టారు. దీంతో ధర్మాసనం ఇద్దరికి రిమాండ్ విధించింది. ఈ మేరకు పోలీసులు జైలుకు తరలించారు.

Next Story