విజయవాడ ఉగ్ర కుట్ర కేసు : నిందితులకు 5 రోజుల పోలీసు కస్టడీ

by Ramesh Naini |

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విజయవాడ ఉగ్రవాద లింకుల కేసు విచారణ కీలక దశకు చేరుకుంది.

విజయవాడ ఉగ్ర కుట్ర కేసు : నిందితులకు 5 రోజుల పోలీసు కస్టడీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విజయవాడ ఉగ్రవాద లింకుల కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో అరెస్టయిన ఐదుగురు నిందితులను ఐదు రోజుల పాటు తమ కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు న్యాయస్థానం పోలీసులకు అనుమతి మంజూరు చేసింది. రేపటి నుంచి కొత్తపేట పోలీసులు వీరిని తమ అదుపులోకి తీసుకుని లోతుగా ప్రశ్నించనున్నారు.

విచారణ ఎదుర్కోనున్న నిందితులు

ఐదుగురు నిందితులు షరీఫ్, సొహైల్ బేగ్, దానిష్, అబ్దుల్ సలాం, సైదా బేగం ప్రస్తుతం రాజమండ్రి కేంద్ర కారాగారంలో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరగా, కోర్టు 5 రోజులకు అనుమతించింది.

విచారణలో కీలక అంశాలు వెలుగులోకి

నిందితులు దేశ భద్రతకు ముప్పు కలిగించేలా కార్యకలాపాలు సాగించినట్లు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో, వారిని మరింత లోతుగా విచారించేందుకు కొత్తపేట పోలీసులు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా వారం రోజుల పాటు నిందితులను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఐదు రోజుల పోలీసు కస్టడీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపటి నుంచి ప్రారంభమయ్యే ఈ విచారణలో.. ఈ ఉగ్ర నెట్‌వర్క్ వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? వీరికి ఎక్కడి నుంచి నిధులు అందాయి? అన్న కోణంలో పోలీసులు ప్రధానంగా ఆరా తీయనున్నారు. కస్టడీ విచారణతో ఈ కేసులో మరిన్ని కీలక, సంచలన నిజాలు బయటపడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Next Story