రాష్ట్రంలో మరో కుంభకోణం.. సిట్‌కు ఆధారాలు ఇస్తానని ఎమ్మెల్యే ప్రకటన

by Vemula.Srinu Prasad |

రాష్ట్రంలో మరో కుంభకోణం జరిగిందని కృష్ణా జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆరోపించారు..

రాష్ట్రంలో మరో కుంభకోణం.. సిట్‌కు ఆధారాలు ఇస్తానని ఎమ్మెల్యే ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో మరో కుంభకోణం(Scheme) జరిగిందని కృష్ణా జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్(Mailavaram Mla Vasantha Krishna Prasad) ఆరోపించారు. గత ప్రభుత్వంలో లిక్కర్(Liquor) విక్రయాల్లో ఎలా అయితే అక్రమాలకు పాల్పడ్డారో.. అలాగే ఇసుకలోనూ డబ్బులు దండుకున్నారని ఆరోపించారు. 2019-24 కాలంలో ఇసుక తవ్వకాల్లో వైఎస్సార్ కాంగ్రెస్(Ysr Congress) పార్టీ నాయకులు పెద్ద ఎత్తున కుంభకోణానికి పాల్పడ్డారని వ్యాఖ్యానించారు. తనను విచారణకు పిలిస్తే సిట్‌కు అన్ని ఆధారాలు సమర్పిస్తానని స్పష్టం చేశారు. ఇక వైఎస్ జగన్ పర్యటనలు, యాత్రలపైనా వసంత కృష్ణ ప్రసాద్ విమర్శలు కురిపించారు. ప్రజలు, పోలీసులపై దొమ్మీలు చేసేందుకు జగన్ యాత్రలు చేస్తున్నారని మండిపడ్డారు. కల్తీ మద్యం తాగా ప్రజలు చనిపోతే అలాంటి వారి కుటుంబాలను పరామర్శించకుండా జైలులో ఉన్న వాళ్ల దగ్గరకు వెళ్లడమేంటని ప్రశ్నించారు. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవడమే జగన్ అజెండా అని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ విమర్శించారు.

Next Story