Kotamreddy: వైసీపీ ప్రభుత్వ హయాంలో వాళ్లను ముప్పుతిప్పలు పెట్టారు.. కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

ఐదేళ్ల వైసీపీ పాలనలో అన్ని రంగాలు కుదేలయ్యాయని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.

Kotamreddy: వైసీపీ ప్రభుత్వ హయాంలో వాళ్లను ముప్పుతిప్పలు పెట్టారు.. కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఐదేళ్ల వైసీపీ పాలనలో అన్ని రంగాలు కుదేలయ్యాయని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సదర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో తమ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనులు చేసేందుకు సిద్ధంగా ఉన్నా.. ఉన్నత స్థాయి అధికారుల నుంచి సపోర్టు ఉండేది కాదన్నారు. రోడ్డు పనులు చేసేందుకు కూడా కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులు పడే వారని గుర్తు చేశారు. చేసిన పనులకు కూడా బిల్లులు చెల్లించే క్రమంలో వైసీపీ సర్కార్ (YCP Government) వారిని ముప్పుతిప్పలు పెట్టిందని ఆరోపించారు. నెల్లూరు రూరల్ (Nellore Rural) పరిధిలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ (L &T)కి ప్రభుత్వం రెగ్యూలర్‌గా బిల్లులు చెల్లిస్తున్నా.. భూగర్భ డ్రైనేజ్ పనులు మాత్రం వేగంగా కొనసాగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిధంగా మేఘ (Megha) సంస్థ కూడా తాగునీటి ప్రాజెక్ట్ పనులను వేగంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సూచించారు.

Next Story