- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
YS Jagan : కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్.. చంద్రబాబుపై జగన్ ఫైర్
సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు(Journalist Kommineni Srinivasa Rao)ను నేడు హైదరాబాద్‌లో ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు(Journalist Kommineni Srinivasa Rao)ను నేడు హైదరాబాద్‌లో ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రాజధాని అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్(YS Jagan) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అరెస్ట్‌ను చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) రాజకీయ కక్ష సాధింపు అని మండిపడ్డారు. చేయని వ్యాఖ్యలకు కొమ్మినేనిని అరెస్ట్ చేయడం దుర్మార్గం అని, ఈ అరెస్టును ఖండిస్తున్నట్టు జగన్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో "రెడ్ బుక్ రాజ్యాంగం" అమలు చేస్తున్నారని, మీడియా స్వేచ్ఛపై దాడి చేస్తున్నారని అన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న చంద్రబాబు.. సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చేసిన తప్పుకు బాధ్యత వహించాల్సి ఉంటుందని జగన్ హెచ్చరించారు.






