త్వరలో అతిపెద్ద తమింగళం అరెస్ట్: సంచలనంగా కొల్లు రవీంద్ర వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

మద్యం కుంభకోణం కేసులో త్వరలో అతిపెద్ద తిమింగలం బయటకు రాబోతోందని మంత్రి కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు.

త్వరలో అతిపెద్ద తమింగళం అరెస్ట్: సంచలనంగా కొల్లు రవీంద్ర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: మద్యం కుంభకోణం కేసు(Liquor Scam Case)లో త్వరలో అతిపెద్ద తిమింగలం బయటకు రాబోతోందని మంత్రి కొల్లు రవీంద్ర(Minister Kollu Ravindra) సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లి(Kanaganapalli)లో సుపరిపాలనలో తొలి అడుగు(Suparipalanalo Toli Adugu) కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. లిక్కర్ స్కామ్‌లో ఇప్పుడు బయటపడుతున్నది చిన్న తిమింగలాలేనని త్వరలో అతిపెద్ద తిమింగలం బయటికి రాబోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోనే అతిపెద్ద మద్యం కుంభకోణం ఇది అని ఆయన అభిప్రాయపడ్డారు. చాలామంది ఇందులో జరిగిన అవినీతిని చూసి ఆశ్చర్యపోతున్నారని కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు.

గత ఐదేళ్లపాటు అరాచక పాలన సాగిందని అభివృద్ధి ఎక్కడికక్కడ ఆగిపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. 10 లక్షల కోట్లకు పైగా అప్పులు పెట్టి పోయారని... పోలవరం, అమరావతి వంటి నిర్మాణాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయన్నారు. ఎక్కడ చూసినా అక్రమ అరెస్టులు, దౌర్జన్యాలు, దోపిడీలే కనిపించాయన్నారు. తనని అరెస్టు చేసి 53 రోజులపాటు జైల్లో ఉంచారని ఇలాగే ఎంతోమంది నాయకులను అక్రమ అరెస్టులు చేశారని గుర్తు చేశారు. ఇలాంటి తీవ్రమైన పరిస్థితుల నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అహర్నిశలు శ్రమిస్తూ రాష్ట్రాన్ని గాడిలో పెట్టారన్నారు. ఇప్పుడు పోలవరంతో పాటు అమరావతి నిర్మాణాలు కూడా జరుగుతున్నాయన్నారు. ఎన్నో కష్టాలు పడి బనకచర్ల ప్రాజెక్టుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపడుతుంటే ఆ ప్రాజెక్టును అడ్డుకునేందుకు జగన్మోహన్ రెడ్డి అన్ని కుయుక్తులు పన్నుతున్నారని విమర్శలు చేశారు. మరోవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చెడుగా చెబుతూ 200కు పైగా మెయిల్స్ చేశారని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు.

Next Story