కోడికత్తి కేసు విచారణ.. మరోసారి వాయిదా

by Thanuru Gopichand |

మాజీ ముఖ్యమంత్రి వైఎస్​జగన్ మోహన్ రెడ్డిపై ఎయిర్ పోర్టులో కోడి కత్తితో దాడి జరిగిన కేసు ఇవాళ ఎన్ఐఏ కోర్టులో విచారణకు వచ్చింది.

కోడికత్తి కేసు విచారణ.. మరోసారి వాయిదా
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం : మాజీ ముఖ్యమంత్రి వైఎస్​జగన్ మోహన్ రెడ్డిపై ఎయిర్ పోర్టులో కోడి కత్తితో దాడి జరిగిన కేసు ఇవాళ ఎన్ఐఏ కోర్టులో విచారణకు వచ్చింది.నిందితుడు జనపల్లి శ్రీనివాసరావు కోర్టుకు హాజరయ్యారు. బాధితుడు జగన్ మోహన్ రెడ్డి కోర్టుకు హాజరు కాకపోవడంతో కేసు మార్చి 21 వ తేదీకి వాయిదా వేస్తూ జడ్జి నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా కోర్టు బయట విదసం నేతలు వెంకట్రావు, ఓంకార్, ఆర్పీఐ రాష్ర్ట కార్యదర్శి పిట్టా వర ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ఆరేళ్లుగా పెండింగ్లో ఉన్న కోడి కత్తి కేసులో ఇంకా రాజకీయ లబ్ధి కోసం జగన్ ఆరాటపడటం దారుణమన్నారు. నిన్న విశాఖలోనే ఉన్న జగన్ ఇవాళ కోర్టుకు రాకపోవడం అంటే ఆయనకు చట్టాలు, కోర్టులు అంటే కనీస గౌరవం లేదని ఆరోపించారు. జగన్ వచ్చే నెల కోర్టు వాయిదాకు రాకపోతే తాడేపల్లి ప్యాలెస్ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కేసును వచ్చే ఎన్నికల వరకూ సాగదీయడానికి బాధితుడే హైకోర్టు, సుప్రీం కోర్టుకు వెళ్ళడం విచిత్రంగా ఉందని విమర్శించారు.

Next Story