స్టూడెంట్ నెం.1 సీన్ రిపీట్.. జైల్లో ఉండి డిగ్రీ ఫస్ట్ క్లాస్‌లో పాసైన కోడికత్తి శ్రీనివాస్

by Disha Web Desk 2 |
స్టూడెంట్ నెం.1 సీన్ రిపీట్.. జైల్లో ఉండి డిగ్రీ ఫస్ట్ క్లాస్‌లో పాసైన కోడికత్తి శ్రీనివాస్
X

దిశ, వెబ్‌డెస్క్: 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం జగన్‌పై వైజాగ్ విమానాశ్రయంలో స్వల్ప అటాక్ జరిగిన విషయం తెలిసిందే. శ్రీనివాస్ అనే వ్యక్తి కోడి కత్తితో జగన్‌పై దాడి చేశాడు. అనంతరం అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకొని న్యాయస్థానం ఎదుట హాజరుపర్చగా.. కోర్టు జైలు శిక్ష విధించింది. ఈ వ్యవహారం నాడు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారాన్నే రేపింది. తాజాగా.. కోడికత్తి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జైల్లో ఉండి తాను డిగ్రీ చదివాను అని చెప్పారు.

సాధారణంగా పాస్ కాలేదని.. ఫస్ట్ క్లాస్‌లో పాసయ్యానని అన్నారు. ఇక్కడితో తాను ఆపబోనని.. మళ్లీ MA కూడా సోసియాలజీ కూడా పూర్తి చేస్తానని తెలిపారు. జైల్లో తాను చదువుకునేందుకు అనేక మంది ప్రోత్సహించారని గుర్తుచేసుకున్నారు. ప్రత్యేకంగా తనకు జైల్లో టీచర్ చదువు చెప్పారని వెల్లడించారు. వాళ్ల సహకారం వల్లే తాను జైల్లో కూడా ప్రశాంతంగా చదువుకోగలిగాను అని అన్నారు. కాగా, రాజమౌళి తెరకెక్కించిన తొలి సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ జైల్లో ఉండి లా చదవిన సన్నివేశాలు మనం చూశాం.


Next Story

Most Viewed