- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Kodali Nani: కొడాలి నానికి హార్ట్ ఎటాక్.. హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ (YCP) సీనియర్ నేత, మాజీ మంత్రి కోడాలి నాని (Kodali Nani) ఇవాళ ఉదయం హార్ట్ ఎటాక్ (Heart Attack)తో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయనను చికిత్స నిమిత్తం నగరంలోని ఏఐజీ ఆసుపత్రి (AIG Hospital)కి తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. కొడాలి నాని (Kodali Nani) గుండెపోటుకు గురయ్యారనే వార్త తెలియగానే వైసీపీ నేతలను (YCP Leaders) ఆయనను పరామర్శించేందుకు, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పేందుకు ఒక్కొక్కరుగా ఏఐజీ ఆసుపత్రికి వస్తున్నారు. ఇక గుడివాడ నియోజవర్గ పరిధిలో నాని అభిమానులు, అనుచరులు ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాగా, రాష్ట్రంలో వైసీపీ (YCP) అధికారంలో కోల్పోవడంతో కొన్నాళ్లుగా మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani) పొలిటికల్‌గా యాక్టివ్‌గా కనిపించడం లేదు. పార్టీ కార్యక్రమాలకు ఎల్లప్పుడూ ముందుడే ఆయన.. అడపాదడపా హాజరవుతున్నారు. ఇక సోషల్ మీడియా (Social Media)లో ఆయన అనారోగ్య కారణలతో రాజకీయాలకు దూరంగా ఉంటున్నారంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలోనే ఆయనకు హార్ట్ఎటాక్ (Heart Attack) రావడం అటు పార్టీ శ్రేణుల్లో.. ఇటు కుటుంబ సభ్యుల్లోనూ ఆందోళన కలిగిస్తోంది. కొడాలి నాని హెల్త్ కండీషన్‌పై ఏఐజీ వైద్యులు (AIG Doctors) ఎలాంటి బులిటెన్ (Bulletin) విడుదల చేయనప్పటికీ.. పరిస్థితి విషమంగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఐసీయూలో వైద్యులు కొడాలి నానికి చికిత్స అందజేస్తున్నారు.