- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అందుకే రాజకీయాలకు దూరంగా ఉన్నా.. కొడాలి నాని కీలక వ్యాఖ్యలు
గుడివాడలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమంలో మాజీ మంత్రి కొడాలి నాని పాల్గొన్నారు.

దిశ, వెబ్ డెస్క్: గుడివాడలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమంలో మాజీ మంత్రి కొడాలి నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొడాలి కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఆరు నెలలుగా తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని చెప్పారు. తనకు బైపాస్ సర్జరీ జరిగిందని దానికోసం ఆరు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారని అన్నారు. అందువల్లే ఆరు నెలల పాటు తాను బయటకు రాలేదని చెప్పారు. మరో ఆరు నెలల పాటు ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొంటానని అన్నారు.
ఆ తరవాత తప్పకుండా ఎప్పటిలాగే రోడ్డు మీదకు వచ్చి ప్రజల కోసం కొట్లాడతానని, ప్రజా ఉద్యమాలు చేస్తానని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న అనేక అవకతవకలు, అక్రమాలను ఎండగడతానని అన్నారు. అన్నింటినీ ఎదుర్కొని జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే కొడాలి నాని వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత అనారోగ్యకారణాల వల్ల ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అప్పుడప్పుడు కనిపించినా గతంలో మాధిరిగా ఆయనలో జోష్ కనిపించడంలేదని అభిమానులు అనుకుంటున్నారు.






