- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కిరండోల్ రైల్వే లైన్ ధ్వంసం.. పల్నాడు జిల్లాను ముంచెత్తిన వరద
మొంథా తుపాను తీరం దాటినా.. దాని ప్రభావం ఏపీతో పాటు తెలంగాణ జిల్లాలపై తీవ్రంగా ఉంది.

దిశ, వెబ్‌డెస్క్: మొంథా తుపాను తీరం దాటినా.. దాని ప్రభావం ఏపీతో పాటు తెలంగాణ జిల్లాలపై తీవ్రంగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. శ్రీకాకుళం జిల్లాలో కురిసిన కుండపోత వర్షానికి కొత్తవలస - కిరండోల్ సింగిల్ రైల్వే లైన్ ధ్వంసమైంది. అరకు రైల్వే టన్నెల్ నంబర్ 32, చిమిడిపల్లి, బొర్రా గుహల మధ్య రైల్వే ట్రాక్ పూర్తిగా ధ్వంసమవ్వగా.. ట్రాక్ పై మట్టి, బండరాళ్లు పేరుకుపోయాయి. దీంతో వరదనీరు నిలవకుండా సిబ్బంది వాటిని తొలగించే ప్రయత్నం చేశారు. ట్రాక్ కొట్టుకుపోవడంతో తాత్కాలికంగా రైళ్ల రాకపోకలను నిలిపివేశారు.
మరోవైపు పల్నాడు జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. నరసరావుపేట, సత్తెనపల్లి, చిలకలూరిపేట ప్రాంతాల్లోని పలు కాలనీల్లోకి వరదనీరు చేరింది. నరసరావుపేట స్టేడియం వద్ద మోకాళ్లలోతు నీరు నిలిచిపోయింది. నాగన్నగుంట, సుందరయ్య కాలనీలు వరద నీటిలో నానుతున్నాయి. ఇళ్లలోకి వర్షపునీరు చేరడంతో స్థానికులు అవస్థలు పడుతున్నారు.
చిలకలూరిపేటలో గత అర్థరాత్రి కురిసిన భీకర వర్షానికి ఎన్టీఆర్ కాలనీ, శాంతినగర్, భావనా రుషినగర్, రూత్ డైకెమేన్ నగర్ ప్రాంతాలు నీటమునిగాయి. గుంటూరు జిల్లా అబ్బినేనిగుంటపాలెం వద్ద రోడ్డు పైనుంచి వరదనీరు పొంగి పొర్లుతుండటంతో చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి పోలీసులు పహారా కాస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో రాకపోకలు నిలిపివేశారు.
READ MORE .....






