Kidnap: అప్పులు చెల్లించలేదని కిడ్నాప్ చేసి చిత్రహింసలు.. చేతులపై మేకులు.. మలద్వారంలో రాడ్లు, నోట్లో పురుగుల మందు.. పల్నాడులో దారుణం

by Thanuru Gopichand |

పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వడ్డీ వ్యాపారులు దారుణాలకు తెగబడుతున్నారు.

Kidnap: అప్పులు చెల్లించలేదని కిడ్నాప్ చేసి చిత్రహింసలు.. చేతులపై మేకులు..  మలద్వారంలో రాడ్లు, నోట్లో పురుగుల మందు.. పల్నాడులో దారుణం
X

దిశ, డైనమిక్​ బ్యూరో, పల్నాడు: పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వడ్డీ వ్యాపారులు (Moneylenders) దారుణాలకు తెగబడుతున్నారు.అప్పులు చెల్లించకపోతే కిడ్నాప్ లకు పాల్పడుతున్నారు. బాకీ ఉన్న వ్యక్తులను రహస్య స్థావరాల్లో నిర్బంధించి బట్టలు ఊడదీసి బెల్ట్ లతో కొట్టడం, చేతులపై మేకులు దింపడం, మలద్వారంలో రాడ్లు దింపటం లాంటి వికృత చర్యలకు పాల్పడుతున్నారు. అప్పటికి దారికి రాకపోతే ఏకంగా ప్రాణాలనే తీసేస్తున్నారు. గత రెండు రోజులుగా సత్తెనపల్లిలో (Sattenapalli) సంచలనం రేపుతున్న హత్య (murder) కిడ్నాప్ (Kidnap)లతో పల్నాడులో కలకలం రేగుతోంది. తాజాగా ఓ వ్యక్తిని కిడ్నాప్​ చేసిన చిత్ర హింసలు పెట్టి పురుగుల మందు తాగించి చంపేశారు. వివరాల్లోకి వెళితే సత్తెనపల్లి మండలం పాకాలపాడుకు చెందిన ముప్పాళ్ళ అంజిబాబు రియల్ వడ్డీ ఎస్టేట్ వ్యాపారం (Real estate business) చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో సత్తెనపల్లి కి చెందిన మహబూబ్ సుభాని అలియాస్ సుప్రీమ్ అనే వ్యక్తి నుంచి రూ.12 లక్షలు బాకీ తీసుకున్నాడు. బాకీ చెల్లించలేక వడ్డీ వ్యాపారి సుప్రీం వేధింపులకు భయపడి హైదరాబాద్ తల దాచుకుంటున్నాడు. నాలుగు రోజుల క్రితం రామారావు అనే వ్యక్తి ని కలిసేందుకు పిడుగురాళ్ల వచ్చాడు. విషయం తెలుసుకున్న వడ్డీ వ్యాపారి సుప్రీం అంజిబాబును ట్రాక్ చేసి కారులో కిడ్నాప్ చేశాడు. మాచవరం సమీపంలోని అటవీ ప్రాంతంలో (forest) నిర్బంధించి కత్తులతో బెదిరించి బాకీ డబ్బులు చెల్లించాలి ఒత్తిడి చేశాడు. అంజిబాబు నోట్లో పురుగుల మందు పోసి చిత్రహింసలు పెట్టారు. అనంతరం అడవిలో అంజిబాబు ను వదిలేసి పరార్ అయ్యాడు. దీనితో తీవ్రంగా గాయపడ్డ అంజిబాబు గుంటూరు ఆసుపత్రిలో నిన్న రాత్రి చికిత్స పొందుతూ మృతిచెందాడు.

రెండు రోజుల కిందట ఇంటువంటి ఘటనే జరిగింది. సత్తెనపల్లి చెందిన పోలిశెట్టి ఆంజనేయ తరుణ్ రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు హోటళ్ళు నిర్వహిస్తుంటాడు. వ్యాపార అవసరాల కోసం సత్తెనపల్లికి చెందిన సయ్యద్ చిన మాబు అలియాస్ నన్నే నుంచి రూ.40 లక్షలు అప్పు గా తీసుకున్నాడు. ఆ అప్పుకు మరో రూ.60 లక్షలు వడ్డీ మొత్తం కోటి రూపాయలు చెల్లించాలని తరుణ్ ను వడ్డీ వ్యాపారి నన్నే వేధిస్తున్నాడు. అప్పు చెల్లించటం ఆలస్యం కావటంతో తరుణ్ నన్నే కిడ్నాప్ చేశాడు. బెల్లంకొండ పులిచింతల డ్యామ్ గుంటూరు ప్రాంతాల్లో కారులో తిప్పుతూ చిత్రహింసలకు గురి చేశాడు. తరుణ్ ఎడమ చేతి మణికట్టు దగ్గర మూడు అంగుళాల మేకులు (nails) దించాడు. అంతటితో ఆగకుండా మలద్వారంలో ఇనుప రాడ్డును దింపాడు. వేధింపులు భరించలేక తరుణ్ వినిపిస్తుంటే తండ్రికి ఫోన్ చేసి కోటి రూపాయలు ఇవ్వకపోయినా పోలీసులకు చెప్పినా చంపేస్తానని బెదిరించాడు. దీంతో తరుణ్ తండ్రి పోలీసులకు (Police) ఫిర్యాదు చేశాడు. పోలీసులు సెల్ ఫోన్ (cell phone) సిగ్నల్ ఆధారంగా నిందితులు పేర్లేచేర్ల లో ఉన్నట్లు గుర్తించి వడ్డీ వ్యాపారి నన్నేతో సహామరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఇదే విధంగా గతంలో కూడా నన్నే క్రోసూరు మండలం హసానాబాద్ సత్తెనపల్లి లోపలు దారుణాలకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. సయ్యద్ నన్నే షేక్ సుప్రీం లకు అప్పులు ఉన్న మిగతా బాధితులు వీరి చర్యలతో భయాందోళనకు గురవుతున్నారు. వీరి నుంచి విముక్తి కల్పించాలని పోలీసులను ఆశ్రయించేందుకు బాధితులు సిద్దమౌతునట్లుగా తెలుస్తోంది.

Next Story