- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు.. ఆ ఇద్దరికీ రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు
ఏపీ లిక్కర్ స్కామ్ కేసు (AP Liquor Scam Case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ లిక్కర్ స్కామ్ కేసు (AP Liquor Scam Case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. శుక్రవారం అరెస్ట్ అయిన సీఎంవో మాజీ కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ కె.ధనుంజయ రెడ్డి (A31), ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి (A32)లను సిట్ అధికారులు ఇవాళ విజయవాడ (Vijayawada) ఏసీబీ కోర్టు (ABC Court)లో ప్రవేశ పెట్టారు. ఈ మేరకు నిందితులు ఇద్దరినీ విచారించి కేసులో మరిన్ని వివరాలు, ఆధారాలను సేకరించాల్సి ఉందని సిట్ అధికారులు కోర్టుకు విన్నవించారు.
ఈ నేపథ్యంలోనే పూర్తి వాదనలు విన్న న్యాయమూర్తి నిందితులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలకు ఈనెల 20 వరకు రిమాండ్ విధిస్తున్నట్లుగా ప్రకటించారు. అదేవిధంగా వారికి జైల్లో ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను సిట్ అధికారులు విజయవాడ జైలుకు తరలిస్తున్నారు. కాగా, ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటి వరకు సిట్ అధికారులు ఏడుగురిని అరెస్టు చేశారు. అందులో ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డి, చాణక్య, సజ్జల శ్రీధర్‌రెడ్డి, దిలీప్, గోవిందప్ప, బాలాజీలు ఉన్నారు. ప్రస్తుతం రిమాండ్ విధించిన ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలు ఈ లిక్కర్ స్కామ్ కేసులో అత్యంత కీలక వ్యవహరించినట్లుగా సిట్ ప్రాథమిక విచారణలో వెల్లడైంది.






