Pawan Kalyan:‘ఆ పథకాలకు క్యాచీగా ఉండే పేర్లు పెట్టాలి’.. ప్రభుత్వానికి కీలక సూచనలు

by Jakkula.Mamatha |

ఏపీ(Andhra Pradesh) సీఎం చంద్రబాబు(CM Chandrababu) అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం ఈ రోజు(గురువారం) జరిగింది.

Pawan Kalyan:‘ఆ పథకాలకు క్యాచీగా ఉండే పేర్లు పెట్టాలి’.. ప్రభుత్వానికి కీలక సూచనలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh) సీఎం చంద్రబాబు(CM Chandrababu) అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం ఈ రోజు(గురువారం) జరిగింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎసీ విజయానంద్, ప్రభుత్వ సలహాదారులు పాల్గొన్నారు. ఈ మేరకు సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా రాజధాని అమరావతి(Amarawati)కి చట్టబద్ధత కల్పించే తీర్మానానికి ఆమోదం తెలిపారు.

భారత్ ఆర్మీ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’(Operation Sindoor) విజయవంతం పై రాష్ట్ర కేబినెట్ కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపింది. సిందూర్ అనే పేరుతో అందరి సెంటిమెంట్‌ను టచ్ చేశారంటూ మంత్రి వర్గం హర్షం వ్యక్తం చేశారు. ఈ మంత్రివర్గ సమావేశం(Cabinet Meeting)లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పథకాలకు ఆ పేర్లు పెట్టాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ప్రభుత్వ పథకాలకు క్యాచీగా ఉండే పేర్లు పెట్టాలని కేబినెట్ మీటింగ్‌లో పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆపరేషన్ సిందూర్ తదనంతర పరిణామాల దృష్ట్యా విశాఖతో పాటు ఇతర తీర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Next Story