- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైల్లే స్టేషన్ల అభివృద్ధికి కీలక అడుగులు
అమృత్ భారత్ పథకం కింద అభివృద్ధి పనులు.

దిశ, వెబ్ డెస్క్ : బాపట్ల జిల్లా పరిధిలోని చీరాల, బాపట్ల, రేపల్లె రైల్వే స్టేషన్ల (Railway Stations) అభివృద్ధికి సంబంధించి కీలక అడుగులు పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమృత్ భారత్ (Amrith Bharat) పథకం కింద ఈ స్టేషన్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు పనులు కొనసాగుతున్నాయి. అయితే నిర్మాణ పనులు కాస్త నెమ్మదిగా సాగుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. పనులు నత్తనడకన సాగడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. దాని వల్ల కేంద్ర ప్రభుత్వ లక్ష్యం నెరవేరడంలో జాప్యం జరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల బాపట్ల, చీరాల, రేపల్లె రైల్వే స్టేషన్లను సందర్శించిన బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ ఆయా రైల్వే స్టేషన్లలో జరుగుతున్న ఆధునీకరణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వెంటనే పనుల వేగాన్ని పెంచాలని అధికారులను ఆదేశించారు. స్టేషన్ల అభివృద్ధిలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూనే, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేశారు. అయితే పనులు జరుగుతున్న తీరుపట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు.
కొంత కాలం క్రితం ఎంపీ కృష్ణ ప్రసాద్ కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కలిశారు. తమ ప్రాంతంలో ప్రాంత రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కొత్త రైల్వే లైన్ ప్రతిపాదనలను కేంద్రానికి విన్నవించారు. ఆ ప్రతిపాదనల్లో బాపట్ల - రేపల్లె మధ్య కొత్త రైల్వే లైన్, బాపట్ల - పర్చూరు - మార్కాపురం రైలు మార్గం ప్రధానమైనవి. ఈ కొత్త మార్గాల ఏర్పాటు వల్ల దివిసీమ ప్రాంత ప్రజలకు గూడూరు, విజయవాడ వైపు ప్రయాణించేందుకు సౌకర్యవంతంగా ఉంటుందనే అభిప్రాయాలు రైలు ప్రయాణికుల్లో వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా రేపల్లె - బాపట్ల లైన్ పూర్తయితే ప్రయాణ దూరం గణనీయంగా తగ్గుతుందని.. వాణిజ్యపరంగా కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అంచనాలు నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రేపల్లె - బాపట్ల మార్గానికి సంబంధించి డీపీఆర్ (DPR) సర్వేకు అనుమతులు లభించగా, మిగిలిన ప్రతిపాదనలపై కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందనే ధీమా ప్రజాప్రతినిధులు.. అధికారుల్లో వ్యక్తమవుతుంది.






