- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమరావతిలో హెచ్‌వోడీ టవర్ల నిర్మాణం.. ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
అమరావతి అభివృద్ధికి కీలక అడుగులు పడుతున్నాయి....

దిశ, వెబ్ డెస్క్: అమరావతి(Amaravati) అభివృద్ధికి కీలక అడుగులు పడుతున్నాయి. రాజధాని(Capital) నుంచి రాష్ట్ర పరిపాలనకు కావాల్సిన నిర్మాణాలను ప్రభుత్వం వేగంగా చేపడుతోంది. ఇప్పటికే పలు కంపెనీల స్థాపనకు ఆయా సంస్థలకు అనుమతులు జారీ చేసింది. భారీ నిర్మాణాలకు సైతం టెండర్ల ప్రక్రియను పూర్తి చేసింది. మరికొన్ని నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇప్పటికే సచివాలయం, అసెంబ్లీ ఉన్న విషయం తెలిసిందే. అయితే రాష్ట్ర సచివాలయాన్ని మరింత మోడ్రన్‌గా కొత్త నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఈ మేరకు టెండర్లు ఆహ్వానించింది. చాలా సంస్థలు టెండర్లు వేశాయి. అయితే
ఆయా సంస్థల టెండర్లను పరిశీలించిన ప్రభుత్వం.. ఇంటిగ్రేటెడ్ సచివాయం(Integrated Secretariat) నిర్మాణంలో భాగంగా హెచ్‌వోడీ టవర్ల నిర్మాణం( HOD Towers Construction ) కోసం తాజాగా టెండర్లు ఖరారు చేసింది. ఎల్ 1గా నిలిచిన సంస్థల బిడ్లను ఆమోదించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ టెండర్ల ఖరారుతో త్వరలో పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికార యంత్రాంగం చెబుతోంది. అమరావతి అభివృద్ధిలో రాష్ట్ర ఇంటిగ్రేటెడ్ సచివాలయం కూడా ఓ భాగం అవుతుందని అంటున్నారు.






