చిన్నారుల విక్రయం కేసులో కీలక అడుగు

by Thanuru Gopichand |   (  Updated:2026-01-02 07:31:11  IST  )

ప్రధాన నిందితులను విచారించనున్న విజయవాడ పోలీసులు.

చిన్నారుల విక్రయం కేసులో కీలక అడుగు
X

దిశ, వెబ్ డెస్క్ : విజయవాడ (Vijayawada) చిన్నారుల విక్రయం కేసులో కీలక ముందడుగు పడింది. నిందితులను విచారించేందుకు (Police Inquiry) రంగం సిద్ధమైంది. ఈ మేరకు ప్రధాన నిందితురాలు సరోజిని, నిందితురాలు భారతిని అధికారులు నేడు ప్రశ్నించనున్నారు. వారిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం నిందితులను భవానీపురం పోలీసు స్టేషనుకు తరలించనున్నారు. అక్కడ విచారణ అధికారులు వారిపై ప్రశ్నల వర్షం కురిపించనున్నట్లు పోలీసులు తెలిపారు. నేటి నుంచి జనవరి 9 వరకు నిందితులను అధికారులు విచారిస్తారని పేర్కొన్నారు. అయితే ప్రధాన నిందితురాలు సరోజినిపై కొత్తపేట, నున్న పోలీసు స్టేషన్లలో పీటీ వారెంట్ దాఖలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

కేసు నేపథ్యం..

దిల్లీ, ముంబై నుంచి చిన్నారులను విజయవాడకు తీసుకొచ్చి విక్రయిస్తున్న ముఠా గుట్టును గతేడాది డిసెంబరులో పోలీసులు ఛేదించారు. అమ్మిన ఇద్దరు చిన్నారులతో సహా మొత్తం ఐదుగురు చిన్నారులను విజయవాడ పోలీసులు రక్షించారు. ఒక్కొక్క చిన్నారిని రూ.3 లక్షల నుంచి రూ.5లక్షలకు విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో గుర్తించారు. ఈ కేసులో మొత్తం 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారిలో కిరణ్ శర్మ, సరోజిని, భారతి ప్రధాన నిందితులుగా ఉన్నారు. భవానీపురం, నున్న, కొత్తపేట స్టేషన్లలో నిందితులపై మూడు వేర్వేరు కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు.

Next Story