- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Google Data Center : విశాఖలో గూగుల్ డేటా సెంటర్ భూసేకరణలో కీలక ముందడుగు
ఉత్తరాంధ్ర ఐటీ ముఖచిత్రాన్ని మార్చే విధంగా విశాఖ జిల్లా తర్లువాడలో ఏర్పాటు కానున్న ప్రతిష్టాత్మక 'గూగుల్ డేటా సెంటర్' నిర్మాణానికి అడ్డంకులు తొలగుతున్నాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తరాంధ్ర ఐటీ ముఖచిత్రాన్ని మార్చే విధంగా విశాఖ జిల్లా తర్లువాడలో ఏర్పాటు కానున్న ప్రతిష్టాత్మక 'గూగుల్ డేటా సెంటర్' నిర్మాణానికి అడ్డంకులు తొలగుతున్నాయి. భూసేకరణ ప్రక్రియలో అత్యంత కీలకమైన ముందడుగు పడింది. ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చేందుకు రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావడంతో అధికారుల్లో ఉత్సాహం నెలకొంది. రాజకీయాలకు అతీతంగా స్పందన డేటా సెంటర్ ఏర్పాటుకు భూములు ఇచ్చేందుకు అంగీకరించిన వారిలో వైసీపీకి చెందిన నాయకులు, రైతులు కూడా ఉన్నట్లు అధికారుల సమాచారం. వీరంతా తమ సమ్మతిని తెలియజేస్తూ అధికారులకు లిఖితపూర్వక లేఖలను అందజేసినట్లు తెలిసింది.
ప్రభుత్వం ఆకర్షనీయమైన ప్యాకేజీ!
మార్కెట్ రేటు కంటే ఎక్కవ పరిహారం, ఎకరాకు 20 సెంట్ల చొప్పున అభివృద్ధి చేసిన భూమి కేటాయింపు, కుటుంబంలో ఒకరికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం, నిర్మించబోయే షాపింగ్ కాంప్లెక్స్‌లో ఒక షాపు, అదనంగా 3 సెంట్ల ఇంటి స్థలం ఇచ్చేందుకు ప్రభుత్వం ప్యాకేజీ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. రైతుల విజ్ఞప్తులు భూసేకరణ విషయమై భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో రైతులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధికి సంబంధించి పలు డిమాండ్లను ఎమ్మెల్యే ముందుంచారు. ముఖ్యంగా గ్రామానికి మెయిన్ రోడ్డు వేయాలని, కళ్యాణ మండపం నిర్మాణం చేపట్టాలని కోరారు. అలాగే, ప్రభుత్వ భూముల్లో చెట్లు పెంచుకుని జీవనం సాగిస్తున్న సుమారు 520 మందికి ప్రభుత్వం 3 సెంట్ల చొప్పున ఇంటి స్థలం ప్రకటించింది. అయితే, తమ జీవనోపాధిని దృష్టిలో ఉంచుకుని దీనిని 5 సెంట్లకు పెంచాలని రైతులు ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు.
మార్చిలో శంకుస్థాపన?
భూసేకరణ ప్రక్రియ కొలిక్కి వస్తుండటంతో, వచ్చే మార్చి నెలలో గూగుల్ డేటా సెంటర్‌కు భూమిపూజ నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే విశాఖపట్నం అంతర్జాతీయ స్థాయి టెక్నాలజీ హబ్‌గా మారుతుందని అధికారులు భావిస్తున్నారు.






