తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

by Satheesh |

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు టీడీపీ చీఫ్, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు టీడీపీ చీఫ్, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి రెండు రాష్ట్రాలు ఏర్పడి నేటికి పదేళ్లు అయ్యిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. రాష్ట్రాలు రెండైనా తెలుగు ప్రజలంతా ఒక్కటేనని అన్నారు. పేదరికం లేని దిశగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రయాణం సాగాలని ఆకాంక్షించారు. ఆర్ధిక సమానతలు నిర్మూలించి సమగ్ర సాధికారిత సాధించాలని కోరారు. తెలుగు ప్రజల విజయాల కీర్తి ప్రపంచవ్యాప్తం కావాలని పిలుపునిచ్చారు.

Next Story