- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AP Government:స్కూళ్లకు కీలక ఆదేశాలు జారీ
by Jakkula.Mamatha |
ఏపీ(Andhra Pradesh)లోని స్కూళ్లకు రాష్ట్ర ప్రభుత్వం(AP Government) కీలక ఆదేశాలు జారీ చేసింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh)లోని స్కూళ్లకు రాష్ట్ర ప్రభుత్వం(AP Government) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల(జూలై) 10వ తేదీన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, జూనియర్ కాలేజీలు ఈ కార్యక్రమం నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో జరిగే ఈ బహిరంగ సమావేశంలో విద్య, మౌలిక సదుపాయాలను కార్యాచరణ ప్రణాళికలను వివరిస్తారు. అలాగే, పిల్లల మానసిక ఆరోగ్యం, పురోగతిపై సెషన్లు, ఆటల పోటీలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా తగు చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ, ఇంటర్ ఎడ్యుకేషన్ డైరెక్టర్లకు సూచించారు.
Next Story






