- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking: ఏపీలో మున్సిపల్ కమిషనర్లకు కీలక ఆదేశాలు
ఏపీలో మున్సిపల్ కమిషనర్లకు మంత్రి నారాయణ కీలక ఆదేశాలు జారీ చేశారు..

దిశ, వెబ్ డెస్క్: వేసవి దృష్ట్యా తాగునీరు, శానిటరీ(Drinking water, sanitation)పై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్లతో మంత్రి నారాయణ(Minister Narayana) టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మున్సిపాలిటీల్లో తాగునీరు, శానిటేషన్ వ్యవస్థపై ఆరా తీశారు. మున్సిపల్ కమిషనర్లు క్షేత్ర స్థాయిలో దృష్టి పెట్టాలని సూచించారు. ఇందుకోసం ఉదయం 6 గంటల నుంచి మున్సిపాలిటీల్లో పర్యటించాలని ఆదేశించారు. తాగు నీరు, పారిశుధ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని చెప్పారు. డ్రైన్లలో పూడికతను వెంటనే ప్రారంభించాలని సూచించారు. ఇక నుంచి మున్సిపాలిటీల్లో ఉదయమే ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శితో పాటు రిజనల్ డైరెక్టర్లు, కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. మున్సిపాలిటీల్లో పారిశుధ్యం నిర్వహణ, ప్రజల అవసరాలు తీర్చడంలో అధికారులు, సిబ్బంది అంకిత భావంతో పని చేయాలని సూచించారు. పేదలను ఇబ్బంది పెట్టకుండా పన్నులు వసూలు చేయాలని ఆదేశించారు.






