- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం.. మండలిలో కీలక చర్చ
ఏపీ శాసనమండలి మూడోరోజు సమావేశాల్లో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధంపై కీలక చర్చ జరిగింది. దీనిపై త్వరలోనే చట్టం తీసుకొస్తామని హోంమంత్రి అనిత పేర్కొన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ శాసనమండలిలో 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధంపై కీలక చర్చ జరిగింది. రాష్ట్రంలో దీనిని అమల్లోకి తీసుకుని రావలసిన అవసరం ఉందని హోంమంత్రి అనిత, జనసేన ఎమ్మెల్సీ నాగబాబులు తెలిపారు. ఇప్పటికే ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ దేశాల్లో పిల్లలకు సోషల్ మీడియా నిషేధించిన విషయాన్ని నాగబాబు గుర్తుచేశారు. సోషల్ మీడియాలో వచ్చే బ్లూవేల్ చాలెంజ్ లో ఎంతోమంది పిల్లలు చనిపోయారన్నారు. మోమో చాలెంజ్, స్కల్ బ్రేకర్ చాలెంజ్, ఫైర్ చాలెంజ్.. ఇలాంటివెన్నో పిల్లల్ని ఆకర్షించి బానిసలుగా మార్చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వీటిపై మంత్రులు లోకేశ్, అనిత వీటిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అభినందించదగిన విషయమన్నారు.
సోషల్ మీడియా వల్ల పిల్లలు రకరకాల డిప్రెషన్లకు గురవుతున్నారని, దీనిపై తీవ్రమైన చట్టాన్ని తీసుకురావాలన్నారు. చట్టం వల్ల ఒక భయం ఉంటుందన్నారు. స్కూళ్లలో ఇచ్చే ట్యాబ్స్ లో కూడా ఎడ్యుకేషన్ తప్ప మరో అంశానికి తావులేకుండా మానిటర్ చేయాలని సూచించారు. తీవ్రమైన పదజాలంతో సోషల్ మీడియాలో పెట్టే పోస్టులపై కూడా చర్యలు తీసుకునేలా ప్రణాళికలు రూపొందించాలని హోంమంత్రి అనిత తెలిపారు. వీటిపై సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీటిపై సమీక్షించారని చెప్పారు. ఈ చట్టాన్ని తీసుకువస్తే ఎలాంటి మార్పు వస్తుందన్న దానిపై ఆలోచిస్తున్నట్లు చెప్పారు. ఇందుకు సభ్యులంతా సహకరించాలని కోరారు.






