3 రోజులకు స్కూల్‌కు రాకపోతే అంతే..విద్యాశాఖ కీలక ఆదేశాలు

by Ajay Maddhiboyina |

ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరిచే దిశ‌గా ఏపీ ప్ర‌భుత్వం అడుగులు వేస్తున్న సంగ‌తి తెలిసిందే. రాష్ట్రంలో మెగా డీఎస్సీ వేయ‌డంతో

3 రోజులకు స్కూల్‌కు రాకపోతే అంతే..విద్యాశాఖ కీలక ఆదేశాలు
X

దిశ‌, వెబ్ డెస్క్: ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరిచే దిశ‌గా ఏపీ ప్ర‌భుత్వం అడుగులు వేస్తున్న సంగ‌తి తెలిసిందే. రాష్ట్రంలో మెగా డీఎస్సీ వేయ‌డంతో పాటు ప్ర‌భుత్వ స్కూళ్ల విష‌యంలో అనేక మార్పులు చేర్పులు చేశారు. మంత్రి నారాలోకేష్ విద్యాశాఖ‌పై ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షా స‌మావేశాలు నిర్వ‌హిస్తూ ప‌లు నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు.

తాజాగా మూడు రోజులకు మించి విద్యార్థులు స్కూలుకు రాకపోతే వెంటనే తల్లిదండ్రులకు ఫోన్ చేయాలని ఏపీ విద్యాశాఖ కీల‌క ఆదేశాలు జారీ చేసింది. 5 రోజుల కంటే ఎక్కువ రోజులు బడికి డుమ్మా కొడితే ఎంఈవో, సీఆర్‌పీలు ఆ విద్యార్థి ఇంటికి వెళ్లాలని సూచించింది. విద్యార్థి రాక‌పోవ‌డానికి కార‌ణాల తెలుసుకోవాల‌ని పేర్కొంది. విద్యార్థులు, టీచర్ల హాజరుపై ప్రత్యేక దృష్టి పెట్టాల‌ని ఆదేశించింది. టీచ‌ర్లు సెల‌వుపెడితే వెంట‌నే ప్ర‌త్యామ్నాయ ఏర్పాటు చేయాల‌ని అక‌డ‌మిక్ ప‌ర్య‌వేక్ష‌ణ అధికారుల‌తో నిర్వ‌హించిన స‌మావేశంలో స్ప‌ష్టం చేసింది.

Next Story