లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. ఆ మాజీ మంత్రికి సిట్‌ నోటీసులు

by Kema Shiva Kumar |

వైసీపీ (YCP) ప్రభుత్వం హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసు ఆంధ్రపదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.

లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. ఆ మాజీ మంత్రికి సిట్‌ నోటీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ (YCP) ప్రభుత్వం హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసు ఆంధ్రపదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. కేసులో అధికారులు నిందితులపై ఛార్జిషీట్‌ను దాఖలు చేసేందుకు సన్నద్ధమైన నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా, గత ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పని చేసిన నారాయణ స్వామి (Narayana Swamy)కి ఇవాళ సిట్ ఈ నెల 21న ఉదయం 10 గంటలకు విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేసింది.

అయితే, రూ.వేల కోట్ల లిక్కర్ కుంభకోణంపై అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ దర్యాప్తునకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను ఏర్పాటు చేసింది. దీంతో విచారణ బృందం ప్రభుత్వ అధికారులు, లిక్కర్ వ్యాపారులు, వైసీపీ నేతలు వారికి సహకరించిన వారిని ప్రశ్నించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. లభ్యమైన కీలక ఆధారాల మేరకు కేసులో ఇప్పటికే వరకు మొత్తం 49 మందిని నిందితులుగా చేర్చారు. అందుతో 11 మందిని సిట్ అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. నిందితుల్లో A1గా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి (రాజ్ కసిరెడ్డి), A2 దొంతి‌రెడ్డి వాసుదేవ రెడ్డి, A3గా దొడ్డ వెంకట సత్యప్రసాద్, A4 పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, A5 మాజీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి, A6 సజ్జల శ్రీధర్ రెడ్డి, A7గా ముప్పిడి అవినాష్ రెడ్డి, A8గా బూనెటి చాణక్య, A9గా తుకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, A10గా SK సైఫ్ అహ్మద్ ఉన్నారు.

అయితే, సిట్ విచారణలో భాగంగా ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. నేడు కోర్టులో సిట్‌ ప్రిలిమినరీ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేయబోతోంది. ఇప్పటి వరకు చేసిన దర్యాప్తులో వెలుగు చూసిన అంశాలు, అందుకు తగిన సాక్ష్యాధారాలు, స్టెట్‌మెంట్లు, ఫోరెన్సిక్ రిపోర్ట్స్, బ్యాంకు లావాదేవీలకు సంబంధించి స్టేట్‌మెంట్లు కోర్టుకు అందజేయబోతుండటంతో.. కేసులో ఏం జరగబోతోంది అనేది కీలకంగా మారింది.

Next Story