లిక్కర్‌ స్కాం కేసులో కీలక పరిణామం.. రేపు సిట్ చేతికి ఆ రిపోర్టు!

by Ramesh Naini |

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన లిక్కర్‌ స్కాం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది.

లిక్కర్‌ స్కాం కేసులో కీలక పరిణామం.. రేపు సిట్ చేతికి ఆ రిపోర్టు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన లిక్కర్‌ స్కాం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుల మొబైల్‌ ఫోన్లకు సంబంధించిన ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ (FSL) నివేదిక కోర్టుకు చేరింది. ఫోన్లలోని డేటా, కాల్‌ రికార్డులు, డిలీట్‌ చేసిన ఫైల్స్‌ తదితర డిజిటల్‌ ఆధారాలపై ఫోరెన్సిక్‌ విశ్లేషణ పూర్తయింది.

కోర్టు అనుమతితో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) రేపు ఈ FSL రిపోర్టును స్వీకరించే అవకాశం ఉంది. లిక్కర్‌ స్కాం వెలుగులోకి వచ్చిన తర్వాత నిందితులు ఫోన్లను ధ్వంసం చేసినప్పటికీ, FSL నిపుణులు ఆధునిక సాంకేతికతతో డేటాను రికవరీ చేసినట్లు సమాచారం. నివేదిక SIT చేతికి అందితే స్కాం వెనక ఉన్న నెట్‌వర్క్‌, నిందితుల మధ్య జరిగిన కమ్యూనికేషన్‌, డిజిటల్‌ లావాదేవీలపై కీలక ఆధారాలు బయటపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ రిపోర్టు కేసు దర్యాప్తులో కీలకంగా మారనుందని, అవసరమైతే కొత్త నోటీసులు, అదనపు అరెస్టులు జరిగే అవకాశం ఉందని న్యాయ వర్గాలు పేర్కొంటున్నాయి.

Next Story