- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. సిట్ కస్టడీలోకి ఆ ముగ్గురు
వైసీపీ (YCP) ప్రభుత్వం హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసు (Liquor Scam Case)లో నిందితులను తమ కస్టడీకి ఇవ్వాలంటూ విజయవాడ ఏసీబీ కోర్టు (ACB Court)లో సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ (YCP) ప్రభుత్వం హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసు (Liquor Scam Case)లో నిందితులను తమ కస్టడీకి ఇవ్వాలంటూ విజయవాడ ఏసీబీ కోర్టు (ACB Court)లో సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కెసిరెడ్డిని 3 రోజుల పాటు.. అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్పలను వారం రోజుల పాటు కస్టడీకి అప్పగించాలంటూ ఆ పిటిషన్‌లో న్యాయస్థానానన్ని అభ్యర్థించారు. అయితే, పూర్తి వాదనలు విన్న ఏసీబీ కోర్టు గురువారం నిందితులను రెండు రోజుల పాటు కస్టడీకి ఇస్తున్నట్లుగా పేర్కొంది.
ఈ నేపథ్యంలోనే ఇవాళ, రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వారి న్యాయవాదుల సమక్షంలో మాత్రమే నిందితులను విచారించాలని సిట్ అధికారులకు సూచించింది. దీంతో ఈ మేరకు ఇవాళ అధికారులు నిందితులు రాజ్ కెసిరెడ్డితో పాటు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్పలను ప్రత్యేక వాహనంలో విజయవాడ జిల్లా జైలు (Vijayawada District Jail) నుంచి విచారణ నిమిత్తం సిట్ కార్యాయానికి తరలించారు. అనంతరం కేసులో పలు అంశాలపై ప్రశ్నించి వారి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయనున్నారు.






