లిక్కర్ స్కామ్‌ కేసులో మరో మలుపు.. సీజ్ చేసిన క్యాష్‌పై ACB కోర్టు కీలక ఆదేశాలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-02 08:55:01  IST  )

వైసీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసులో (AP Liquor Scam) జెట్ స్పీడ్‌లో విచారణ కొనసాగుతోంది.

లిక్కర్ స్కామ్‌ కేసులో మరో మలుపు.. సీజ్ చేసిన క్యాష్‌పై ACB కోర్టు కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసులో (AP Liquor Scam) జెట్ స్పీడ్‌లో విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కేసులో నిందితులుగా ఉన్న ఇండ్లు, కార్యాలయాల్లో సోదాలు చేపట్టిన సిట్‌ అధికారులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. రాజ్‌ కెసిరెడ్డి వివరాల మేరకు 12 అట్ట పెట్టెల్లో భద్రపరిచిన రూ.11 కోట్ల నగదును అధికారులు ఇటవల సీజ్‌ చేసిన విషయం తెలిసిందే. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం కాచారంలోని సులోచన ఫార్మ్‌ గెస్ట్‌‌హౌస్‌లో లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన నగదును అధికారుల గురించారు. కేసులో A-40 వరుణ్‌ పురుషోత్తం ఇచ్చిన వాంగ్మూలం మేరకు విస్తృతంగా తనిఖీలు చేపట్టిన సిట్ అధికారులు భారీగా సీజ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఏసీబీ కోర్టులో సిట్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేసులో పట్టుబడిన రూ.11 కోట్ల నగదును మాచవరం పరిధిలోని SBI బ్యాంకులో వెంటనే డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు నగదును పటమట SBI బ్రాంచ్‌లో లెక్కించిన బ్యాంకు సిబ్బంది నంబరింగ్ ప్రకారం వీడియో తీసి ఆ వీడియోను కోర్టుకు అందజేయనున్నారు.

Next Story